శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు.. నాలుగు నెలల తర్వాత బిడ్డ కావాలంటూ..

X
By - Nagesh Swarna |30 Oct 2020 12:34 PM IST
కుటుంబ పోషణ భారంగా ఉందని తల్లిదండ్రులు మధ్యవర్తి ద్వారా పసిబిడ్డను అమ్మేశారు. అయితే.. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ తనకు కావాలంటూ ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీనా, వెంకటేష్ అనే దంపతులకు జూలై 19న పిల్లాడు పుట్టాడు. అనంతరం వేరొకరికి ఆ చిన్నారిని అమ్మేశారు. అయితే.. ఆ సమయంలో ఆడపిల్ల అని చెప్పి.. మగబిడ్డను మధ్యవర్తి అమ్మేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com