సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపు

X
ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపిచ్చింది. లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి ముట్టడి కోసం బజరంగ్ దళ్ నేతలు వెళ్లారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీలో దేవాలయాలపై దాడులు పెరగడంపై బజరంగ్ దల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట విగ్రహాలు ధ్వంసం అవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. మరోవైపు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను బజరంగ్ దళ్ తీవ్రంగా తప్పు పడుతోంది. వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని.. అలాగే హిందూ సంఘాలకు మంత్రితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తూ జగన్ నివాసం ముట్టడికి బజరంగ్‌దళ్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
