Balakrishna: సీఎం కేసీఆర్ ఆలోచనతో మంత్రి హరీష్ రావు పనిచేస్తున్నారు- బాలయ్య

Balakrishna: సీఎం కేసీఆర్ ఆలోచనతో మంత్రి హరీష్ రావు పనిచేస్తున్నారు- బాలయ్య
Balakrishna: అమ్మగారి కోరిక మేరకే.. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ఆసుపత్రిని నిర్మించినట్లు తెలిపారు బాలకృష్ణ.

Balakrishna: అమ్మగారి కోరిక మేరకే.. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ఆసుపత్రిని నిర్మించినట్లు తెలిపారు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ ఆసుపత్రికి అనేక మంది దాతలు సహాయం చేశారని, వారందరికి ధన్యవాదాలు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో మంత్రి హరీష్ రావు పనిచేస్తున్నారన్నారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కింద రూ. 6 కోట్లు మాఫీ చేసినందుకు ధన్యవాదాల చెప్పారు బాలయ్య. సినిమా,సేవ ,రాజకీయ రంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారు మంత్రి హరీష్‌.

వారి నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా బాలయ్య పనిచేస్తున్నారని, తనకంటూ ఒక్క ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఎన్టీఆర్‌ అంటే సీఎం కేసీఆర్‌కు చాలా అభిమానమి.. అనేక సార్లు కేసీఆర్‌, నేను ఈ ఆసుపత్రి గురించి మాట్లాడుకునే వాళ్ళమన్నారు. బయట రోగులు నిద్రుపోతుంటే కేసీఆర్‌ చాలా బాధపడ్డారన్నారు. నలుగురు సీఎంలు చేయని పని కేసీఆర్ చేశారని.. ఈ ఆసుపత్రికి బిల్డింగ్ రెగ్యులరైజేషన్‌ కింద 6 కోట్ల మాఫీ చేశారన్నారు మంత్రి హరీష్‌రావు.

Tags

Read MoreRead Less
Next Story