Bandi Arrest : పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక, లీకేజీ ఎలా అవుతుంది ..? : హైకోర్టు

X
By - Vijayanand |6 April 2023 3:43 PM IST
బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చన్న హైకోర్టు... తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక.. లీకేజీ ఎలా అవుతుందని ప్రశ్నించింది హైకోర్టు. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు మూడ్రోజులు సెలవులు ఉన్నాయని బండి సంజయ్ తరపున న్యాయవాది... హైకోర్టుకు విన్నవించారు. దీంతో బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చన్న హైకోర్టు... తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com