Bandi Sanjay: కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే హక్కు లేదు

Bandi Sanjay: కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే హక్కు లేదు
X
కేసీఆర్‌ అంబేద్కర్‌ను అవమాన పరిచాడు

గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకు పడ్డారు. కేసీఆర్‌ కు ఈ దేశంలో జీవించడానికి నైతిక హక్కులేదన్నారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహంచలేదన్నారు. ఇది డా. అంబేద్కర్‌ను అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్‌ను సైతం కేసీఆర్‌ అడుగడుగునా అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీని అభివృద్ధి చేసుకునేందుకు మాత్రం ఇతర రాష్ట్ర ముఖ్య మంత్రులను పిలుస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఆయా రాష్ట్రాల గవర్నర్లను పిలవకుండా గణతంత్ర వేడుకలు నిర్వహించమని ముఖ్యమంత్రులకు చెప్పాలని బండి ప్రశ్నించారు. డా. బీఆర్‌ అంబేద్కర్‌, ప్రధాని మోదీల స్పూర్తితో ప్రజాస్వామ్య బద్దమైన తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Tags

Next Story