Bandi Sanjay : బండి సంజయ్ అరెస్ట్.. జనగామలో ఉద్రిక్త పరిస్థితులు..

Bandi Sanjay : బండి సంజయ్ అరెస్ట్.. జనగామలో ఉద్రిక్త పరిస్థితులు..
X
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు పోలీసులు

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేశారు పోలీసులు. బండి సంజయ్‌ చేపట్టిన ధర్మదీక్షను భగ్నం చేశారు. కార్యకర్తలపై హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులకు నిరసనగా ధర్మ దీక్షకు దిగుతుండగా సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనగామలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సంజయ్ అరెస్టు సందర్భంగా పోలీసులు..బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బండి సంజయ్‌ను తరలిస్తున్న వెహికిల్‌ను అడ్డుకున్నారు కార్యకర్తలు.

సంజయ్‌ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీజేపీ నేతలు. బండి సంజయ్ పాదయాత్రతో టీఆర్ఎస్‌లో వణుకు స్టార్ట్ అయిందన్నారు. భయంతోనే టీఆర్ఎస్‌ అరెస్టులు చేస్తోందన్నారు. కేసీఆర్‌, టీఆర్ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Next Story