ఈటల రాజీనామా వల్లే దళితబంధు పథకం తెచ్చారు : బండి సంజయ్

X
హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుస్తాడని ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడంతో సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు బండి సంజయ్. ఈటల రాజీనామా వల్లే దళితబంధు పథకం తెచ్చారని.. భూములు కూడా అమ్మి ఆ డబ్బునంతా...హుజురాబాద్‌లో కుమ్మరిస్తున్నారని ఆరోపించారు...అంబేద్కర్ జయంది, వర్ధంతులకు హాజరుకాని కేసీఆర్.. దళితులకు న్యాయం చేస్తాడా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఉపఎన్నికలు వచ్చిన ప్రతిసారీ హామీల వర్షం కురిపించిన కేసీఆర్.. అందులో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశాడు..హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల పాదయాత్ర 6వ రోజూ కొనసాగుతోంది. సంఘీభావం తెలిపిన బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
