Bandi Sanjay : మునుగోడులో బీజేపీదే గెలుపు : బండి సంజయ్

Bandi Sanjay : మునుగోడు ఉపఎన్నికలో గెలుపు బీజేపీదేనని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. యాదాద్రి జిల్లా బస్వాపూర్ నుంచి రెండోరోజు పాదయాత్ర ప్రారంభించిన ఆయన.. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. ఈనెల 7న మునుగోడులో పాదయాత్ర, బహిరంగసభ ఉంటుందన్నారు. బహిరంగసభకు తరుణ్‌చుగ్ వచ్చే అవకాశం ఉందని, అదే సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అవుతాయని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు.. చాలా మంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. త్వరలో బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటాలను చూసి ఇతర పార్టీల నాయకులు బీజేపీలోకి వస్తున్నారని.. పార్టీలోకి వచ్చేవారికి సముచిత గౌరవం ఇస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పాలన నడుస్తోందన్న బండి సంజయ్.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ బీజేపీనే అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com