ఈటల రాజేందర్‌ను పరామర్శించిన బండిసంజయ్

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఈటలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపత్యంలో వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ అస్వస్థతకు గురికాగా.. హైదరాబాద్‌కు తరలించారు.
ఆరోగ్య రీత్యా పాదయాత్రను నిలిపివేయాలని ఈటలను కోరామని.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. అయితే ఈటల మాత్రం పాదయాత్ర కొనసాగిస్తామన్నారని తెలిపారు. ఈటల కష్టపడి పాదయాత్ర చేస్తుంటే.. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి అక్రమ పద్ధతిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్ మండి పడ్డారు. బండి సంజయ్ వెంట జి.వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com