Bandi Sanjay: బండి సంజయ్‌కు అస్వస్థత.. మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో..

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ అస్వస్థతకు గురికావడంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.. 11 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో వడదెబ్బ తగిలినట్లుగా వైద్యులు చెప్తున్నారు.. దీనికి ఎసిడిటీ కూడా తోడవడంతో అస్వస్థతకు గురయ్యారు..
పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది.. అయితే, ఆరోగ్యం బాగోలేనందున పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.. అయితే, బండి సంజయ్ మాత్రం పాదయాత్ర చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం..వడదెబ్బ, ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా ఉన్నారని వైద్యులు చెప్తున్నారు.. అయితే, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com