Bandi Sanjay: అమిత్ షా చెప్పుల వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్..

Bandi Sanjay: అమిత్ షా చెప్పుల వ్యవహారంపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అవసరం ఉంటే కాళ్లు మొక్కడం.. లేదంటే కాళ్లు పట్టి గుంజడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు అంటూ కౌంటర్ ఇచ్చాడు బండి.
మీరు సాష్టాంగ దండ ప్రమాణం చేసినప్పుడు బెంగాల్‌కు,తమిళనాడుకు గులామ్ అయ్యారా అంటూ మండిపడ్డారు. రామ,భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నామని, తండ్రిని బంధించి, అన్నను చంపి అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు వారసులను పక్కన తిరిగే మీకు మా సంసృతి ఏం అర్ధమవుతుందని అన్నారు. మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తామని, మజ్లీస్‌కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదని కౌంటర్ ఇచ్చాడు బండి సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com