Bandi Sanjay: కేసీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారు: బండి సంజయ్

Bandi Sanjay: ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా టూర్‌తో రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని మోదీ టార్గెట్‌గా కేసీఆర్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోదీ పాలనలో దేశం సర్వనాశనం అయిందని విరుచుకుపడ్డారు. మోదీ ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. కేసీఆర్... ఆయన స్థాయి మరచి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. దేశంలో విచ్చలవిడితనం పెరిగిందని కేసీఆర్ అనడం దారుణమన్నారు. తెలంగాణలోనే అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. 8 ఏళ్లలో కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని.. టీఆర్‌ఎస్ ఓట్ల శాతం తగ్గిపోతుందన్నారు బండి సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com