Bandi Sanjay: టెక్స్‌టైల్ పార్కులు మూసివేసిన దుర్మార్గుడు కేసీఆర్: బండి సంజయ్
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు.. ప్రొఫసర్ జయశంకర్‌ను కేసీఆర్ అడుగడుగునా అవమానించారని.. ఆయన మరణానికి పరోక్షంగా కేసీఆరే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు.. భూదాన్ పోచంపల్లిలో ఐదో రోజు బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టెక్స్‌టైల్ పార్క్‌లు మూసివేసిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత బీమా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు.. ఏడాదిగా అనేక మంది చేనేత కార్మికులు చనిపోయినా ఎలాంటి సాయం చేయలేదన్నారు.. స్థానికంగా 3వందల మందికిపైగా చేనేత కార్మికులు చనిపోయినా పట్టించుకోని కేసీఆర్.. పంజాబ్ రైతులకు మాత్రం సాయం చేశారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com