BANDI SANJAY: డేట్, టైం ఫిక్స్ చెయ్..సీఎం రమేష్ ను తీసుకొస్తా

BANDI SANJAY: డేట్, టైం ఫిక్స్ చెయ్..సీఎం రమేష్ ను తీసుకొస్తా
X
కేటీఆర్కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్.. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానన్నది నిజమే.. సీఎం రమేష్ వ్యాఖ్యలు నిజమేనని స్పష్టీకరణ

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కంచె గచ్చిబౌలి భూముల కేంద్రంగా మొదలైన రాజకీయ రచ్చ... కోవర్టు రాజకీయాలు, డైవర్ట్ పాలిటిక్స్ అంటూ వేరే స్థాయిలోకి వెళ్లాయి. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేశ్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ఇద్దరి మధ్యలోకి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే కేటీఆర్కు సవాల్ విసిరారు. సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా ప్రధాని సహా బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నాయకు లు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యా- రు. ఇకపై తప్పుడు ప్రచారం చేస్తే అంతు చూ స్తామని.. తమ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటార ని.. ఖబడ్డార్ కేటీఆర్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

తండ్రి, కొడుకు, అల్లుడు పార్టీ

కేటీఆర్ వాడిన భాషను తీవ్రంగా తప్పుబట్టిన బండి సంజయ్, కేటీఆర్ భాషను మార్చుకోవాలని, లేదంటే తగిన చర్యలు తీ- సుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ను "తండ్రి, కొడుకు, అల్లుడు" పార్టీగా అభివర్ణించిన బండి సంజయ్, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, బీజేపీలో విలీనం అయ్యే ప్ర సక్తే లేదని స్పష్టం చేశారు. కంచ గచ్చబౌలి భూములు, ఓ రోడ్ కాంట్రాక్టు విషయంలో కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేయగా... సీఎం రమేశ్ అంతకు రెట్టింపు స్థాయిలో స్పందించడం తెలిసిం దే. ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే, కేటీఆర్ తన వద్దకు వచ్చి వాపోయాడని సీఎం రమేశ్ వెల్లడించారు. దాంతో తాను జోక్యం చేసుకుని కేటీఆర్ కు టికెట్ ఇప్పించానని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ గుర్తు చేశారు.

వేదిక ఫిక్స్ చేస్తా

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రమేశ్ చెప్పింది నిజమే కాదనే దమ్ము కేటీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు. డేట్, టైం ఫిక్స్ చేసి చర్చకు రావాలని ఆయనకు సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని ప్రారం భించిన అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. 'సీఎం రమేష్ ను రప్పించి వేదిక ఏర్పాటు చేయిస్త. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్ చెప్పాలి. కుటుంబ, వారసత్వ పార్టీలకు బీజేపీ దూరం. ప్రధాని మోదీ కూడా నిజామాబాద్ సభలో ఇదే చెప్పా- రు. అవినీతి, కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే ప్ర. సక్తే లేదు. రాష్ట్రం లో వాళ్ల పనైపోయింది. ఆ పార్టీని నడపలేక కేసీఆర్ చే తులెత్తేశారు. బీఆర్ఎసీడర్లు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయా రు. ఆ ఆక్రోశంతోనే కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సీఎంను తిడుతున్నా స్పందించలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు' అంటూ మండి డ్డారు.

Tags

Next Story