BANDI SANJAY: "తల నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ మాత్రం పెట్టను"

జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కాంగ్రెస్-బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మీటింగ్కు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ రద్దు చేశారని ఆరోపించారు. అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రచారానికి వస్తానని చెప్పానని.. చెప్పినట్లే వచ్చానని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ గడీని బద్దలు కొట్టింది బీజేపీనే అని అన్నారు. ఎన్నికలు రాగానే ముస్లింల టోపీ పెట్టుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు అయిపోయిందని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముస్లిం టోపీ పెట్టుకోవడం, పాకిస్తాన్ను పొగడటం వంటివి చేస్తారని మండిపడ్డారు. తన వరకూ వస్తే.. తల అయినా నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకొని మాత్రం ఓట్లు అడుక్కోను అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ భోగస్ అని కొట్టిపారేశారు. మరోవైపు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. ఆ పార్టీకి ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు.
"సన్న బియ్యం ఎట్ల ఆపుతారో చెప్పాలి"
కాంగ్రెస్కు ఓటు వేయకపోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారని.. అసలు ఎలా ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగమని ఆయన గుర్తు చేశారు.సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2 వందల బస్తీ దవాఖానలు కేంద్రం సహకారంతో నడుస్తున్నాయి… కేసీఆర్ పేరు మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైద్రాబాద్లో జరుగుతున్నాయన్నారు. వివిధ అంశాల పై కేసీఆర్కు 40 లెటర్లు రాశానన్న కిషన్ రెడ్డి.. అయినా కేసీఆర్ స్పందించలేదని.. ఇప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

