ఆగస్టు 9న ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి... రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జ్‌లు హాజరయ్యారు. జిల్లాస్థాయిలో సంస్థాగతంగా సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. ఈ సమావేశంలో.... బీజేపీ సీనియర్‌నేతల సమావేశం తీసుకున్న నిర్ణయాలను వివరించారు బండి సంజయ్. ఆగస్టు 9న ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి తాను పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు బండి సంజయ్. ఈ పాదయాత్ర విజయవంతం కోసం 25 కమిటీలు వేయాలని నిర్ణయించారు.
పాదయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక ఇంఛార్జ్, ఇద్దరు లేక ముగ్గురు కో ఇంఛార్జ్‌లు నియమిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రకు కేంద్రమంత్రులు, జాతీయ నేతల ఆహ్వానానికి ప్రత్యేక కమిటీ నియమిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల అంశం నిరంతరం ప్రజల్లోఉండేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్విట్ ఇండియా నాటి పరిస్థితులే ఉన్నాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు బండిసంజయ్. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారాయన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com