Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా

బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతితో బీజేపీ అధిష్టానం ఈనెల 24 వరకు సంతాప దినాలు ప్రకటించింది. దీంతో రాష్ట్ర నాయకత్వం పాదయాత్రపై డైలామాలో పడింది. సంతాప దినాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించ వద్దని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో పాదయాత్ర ప్రారంభానికి మరో ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. ముందుగా 50వేల మందితో అట్టహాసంగా పాదయాత్రను ప్రారంభించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర మొదలవుతుందని మొదట పార్టీ నేతలు వెల్లడించారు. కళ్యాణ్ సింగ్ మృతితో పార్టీ ఆనవాయితీ ప్రకారం.. సంతాప దినాలలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్న నిబంధనల నేపథ్యంలో పాదయాత్ర వాయిదా పడింది. అటు కల్యాణ్‌సింగ్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో నడుచుకున్నారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com