Bandi sanjay : ఈ నెల 24 నుంచి బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర'

ఈ నెల 24 నుంచి బండి సంజయ్ చేపట్టబోయే పాదయాత్రకు 'ప్రజా సంగ్రామ యాత్ర' పేరును ఖరారు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ఈ పాదయాత్ర విజయవంతం చేసేందుకు 29 కమిటీల్ని కూడా వేశారు. 2023లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ప్రకటించారు. BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామిగౌడ్, ఇతర నేతలతో కలిసి ఇవాళ చార్మినార్ అమ్మవారి ఆలయం వద్ద పూజలు చేసిన తర్వాత యాత్ర పేరుపై ప్రకటన చేశారు. హుజురాబాద్ ఎన్నికల్ని డబ్బుతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ఏపీ అక్రమంగా నీళ్లను తీసుకెళ్తున్నా ఆపే దమ్ము కేసీఆర్‌కు లేదని టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com