Bandi Sanjay : బండి సంజయ్ సభలో ఉద్రిక్తత.. పలువురికి తీవ్ర గాయాలు..

Bandi Sanjay : జనగామ జిల్లా దేవరుప్పులలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సభలో ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్ల దాడి చేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. ఇరు పార్టీల కార్యకర్తల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరుపార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టారు పోలీసులు. బీజేపీ ఫ్లెక్సీలు, హోర్డింగులను టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
అంతకుముందు.. బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో.. స్థానిక బీజేపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతుండగా బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.
పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. కేంద్రం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని నిలదీశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com