పెట్రోల్‌పై 24 రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గిస్తే.. తెలంగాణ ఎందుకు తగ్గించలేదు: బండి సంజయ్

పెట్రోల్‌పై 24 రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గిస్తే.. తెలంగాణ ఎందుకు తగ్గించలేదు: బండి సంజయ్
Bandi sanjay : పెట్రోల్‌పై 24 రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గిస్తే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎందుకు తగ్గించలేదని నిలదీశారు బండి సంజయ్.

Bandi sanjay : పెట్రోల్‌పై 24 రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గిస్తే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎందుకు తగ్గించలేదని నిలదీశారు బండి సంజయ్. వ్యాట్‌ అధికంగా వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. 2015లో పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ విధించింది కేసీఆర్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే టీఆర్‌ఎస్‌ మంత్రులు ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం 2 లక్షల 52వేల కోట్లు ఇస్తే.. కేవలం 40వేల కోట్లే ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు బండి సంజయ్.

అటు తెలంగాణలో వరి కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిందన్నారు బండి సంజయ్. 60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొంటామని ఆగస్ట్ 31వ తేదీన స్వయంగా కేంద్రమే లేఖ రాసిందన్నారు. కాని, సీఎం కేసీఆర్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతోందో కేసీఆర్ చెప్పాలన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద స్కామ్‌ చేస్తున్నారని ఆరోపించారు. వరి వేయొద్దని ఒకసారి, పత్తి వేయొద్దని మరోసారి రైతులను గందరగోళంలోకి నెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు. రైతు చట్టాల్లో మార్కెట్ కమిటీల రద్దు ప్రస్తావనే లేదన్నారు బండి సంజయ్.

Tags

Read MoreRead Less
Next Story