Raghurama Krishna Raju : రఘురామ అరెస్టు తీరు దారుణం: బండి సంజయ్

Bandi Sanjay : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణంగా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఎంపీని బలవంతంగా కారులోకి నెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీ అరెస్టుకు లోక్ సభ స్పీకర్ అనుమతి లేకున్నా, AP సర్కారు ఏ విధంగా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. ఇటీవలె హార్ట్ సర్జరీ జరిగిన వ్యక్తి పట్ల ఏపీ పోలీసుల వ్యవహారశైలి అమానుషమని బండి సంజయ్ మండిపడ్డారు. కాగా ఎంపీ రఘురామను నిన్న ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.. హైదరాబాద్లోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో రఘురామ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామ అరెస్టు తీరుపై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తీసుకెళ్లారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com