Bandi Sanjay: బడ్జెట్‌పై ప్రశ్నించకూడదనే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు: బండి సంజయ్

Bandi Sanjay: బడ్జెట్‌పై ప్రశ్నించకూడదనే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు: బండి సంజయ్
X
Bandi Sanjay: కేంద్రాన్ని తిట్టడమే లక్ష్యంగా బడ్జెట్ పెట్టారని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు.

Bandi Sanjay: కేంద్ర ప్రభుత్వంను తిట్టడమే లక్ష్యంగా బడ్జెట్ పెట్టారని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. బడ్జెట్ పై ప్రశ్నించకూడదనే బీజేపీ ఎమ్మెల్యే లను సస్పెండ్ చేశారని, ప్రగతి భవన్‌లోనే, ఫాం హౌస్ లోనో సమావేశాలు పెట్టుకోవాల్సిందని మండిపడ్డారు. త్రిపుల్‌ ఆర్‌ సినిమా ట్రైలర్‌కే కేసీఆర్‌ భయపడుతున్నారని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. తమ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారనే ముందస్తుగా రాసుకు వచ్చిన స్క్రిప్ట్ మేరకే సస్పెండ్ చేశారని ఫైర్‌ అయ్యారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు.

Tags

Next Story