Bandi Sanjay : ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమో చెప్పిన బండి సంజయ్..

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 మంది టీఆర్‌ఎస్ నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వీరంతా తమతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ఉపఎన్నిక వస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని జనం అనుకుంటున్నారన్నారు. అయితే... ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఉపఎన్నిక వస్తే రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడుతుందన్నారు.
టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు కూడా నేతలు భయపడుతున్నారు. క్యాసినో కేసులో టీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక... నయీంతో సహా డ్రగ్ కేసులు తిరగదోడుతామన్నారు బండి సంజయ్. క్యాసినో కేసు బయటికి వచ్చినందుకు కేసీఆర్ కుటుంబసభ్యులు భయపడుతున్నారని.... . కొంతమంది టీఆర్‌ఎస్ నేతలు, కుటుంబసభ్యులు విదేశాలకు పోయారన్నారు. రిపోర్టర్లతో.... చిట్ చాట్‌లో భాగంగా ఈ వాఖ్యలు చేశారు బండి సంజయ్
బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కొనసాగుతోంది. మూడో రోజైన ఇవాళ..... భువనగిరి మండలం గొల్లగూడెం నుంచి ప్రారంభమైంది. మఖ్ధుంపల్లి, పెద్దపలుగుతండా, చిన్నఅరవెల్పల్లి మీదుగా గుర్రాలదండి వరకు.. యాత్ర సాగుతుంది. గుర్రాలదండిలో సంజయ్ రాత్రి బస చేయనున్నారు బండి సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com