Bandi Sanjay :బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష వేదిక మార్పు

Bandi Sanjay : బీజేపీ రేపటి నిరుద్యోగ దీక్ష వేదిక మారింది. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష జరుగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇందిరాపార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. తన దీక్షకు భయపడే కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి కనుకే ప్రభుత్వం... ఆంక్షలను ఆకస్మికంగా అమలు చేస్తోందని దుయ్యబట్టారు బండి సంజయ్. బీజేపీ నిరుద్యోగ దీక్ష యథావిథిగా కొనసాగుతుందని, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం పది నుంచి సాయంత్రం 5 గంటల వరకు బండి సంజయ్ దీక్ష నిర్వహిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com