Bandi Sanjay: 14 లక్షల మంది కౌలు రైతులకు అన్యాయం.. కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..

Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష క్షమించరానిదన్నారు.
వారికి కూడా రైతు బంధు, రైతు బీమా, యంత్ర లక్ష్మీ సహా ప్రభుత్వ పథకాలేవి వర్తించకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలుకాకపోవడం బాధాకరమన్నారు.
ఇక భూ యజమానుల హక్కులకు భంగం వాటిల్లకుండా.. కౌలు రైతులకు భరోసా కల్పించేలా కౌలు చట్టంలో మార్పులు తీసుకురావాలని 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొందని.. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు బండి సంజయ్.
కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని నాబార్డు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. భూమిని సాగు చేసి, పంట పండించేవాడే నిజమైన రైతన్నారు. కౌలు రైతుల సమస్యలపై చర్చించేందుకు రైతు సంఘాలు, మేథావులు, అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com