Bandi sanjay : పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు : బండి సంజయ్‌

Bandi sanjay : పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు : బండి సంజయ్‌
X
Bandi sanjay : పాదయాత్రకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Bandi sanjay : పాదయాత్రకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లని తెలిపారు. వ్యక్తుల కోసం పనిచేసే వారికి టికెట్లు రావని.. టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు.. నాయకులను తిప్పుకుంటున్నారన్నారు. తిప్పుకున్న వారికి.. తిరిగిన వారికి ఇద్దరికీ టికెట్లు రావని హెచ్చరించారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇదే విషయంపై స్పష్టత ఇచ్చారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని.. ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వారు బీజేపీలో ముఖ్యమంత్రులు కాలేరన్నారు. అధ్యక్షుడైనప్పటికీ తన టికెట్‌పై కూడా స్పష్టత లేదన్నారు బండి సంజయ్‌. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్న వారికే టికెట్లు రాలేదన్నారు.

Tags

Next Story