BATHUKAMMA: కనుల పండువగా.. ఎంగిలిపూల బతుకమ్మ

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హనుమకొండ వేయి స్తంభాల ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు భట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూలనే దైవంగా పూజించే విష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. రంగురంగుల పువ్వులతో మహిళలు బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ పాటపాడి ఆకట్టుకున్నారు. మరోవైపు తెలంగాణ భవన్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలను పేర్చి సందడిగా ఆడి, పాడారు.
ఒక్కేసి పువ్వేసి చందమామ...ఒక్కజాములాయే చందమామ అంటూ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరి గాయి. సాయంత్రం ప్రధాన కూడళ్ల వద్ద , ఆలయాల వద్ద బతుకమ్మలను పెట్టి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోగిపోయాయి. అనంత రం జన్మభూమినగర్చెరువులో, ప్రధానకూడళ్ల వద్ద, రాళ్లవా గులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కాగా విశ్వనాథ ఆల యం ప్రధాన అర్చకుడు నరహరిశర్మ మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వం, ఆచార వ్యవహరాలకు బతుకమ్మ పండగ అద్దం ప డుతుందన్నారు. మంచిర్యాల మార్కెట్ ప్రాంతంలో ఉదయం వ్యాపారులు వివిధ రకాల పూలను విక్రయించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్లో పూలను కొనుగోలు చేశారు.
. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు ఆటాపాటలతో సందడి చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. బతుకమ్మ ఆడిన తర్వాత స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో వాటిని నిమజ్జనం చేశారు. సెప్టెంబర్ 21 ఆదివారం పితృఅమావాస్య నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన తర్వాత ఈ పండుగ మొదలవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com