Ajman : అజ్మాన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

Ajman : అజ్మాన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
Ajman : ఈటీసీఏ, తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహంచారు

Ajman : ఈటీసీఏ, తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహంచారు. అజ్మాన్‌లోని ఇండియన్ అసోసియేషన్ ఆడిటోరియంలో సుమారు 5వేల మందితో ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం, తెలుగు అసోసియేషన్, తెలంగాణ జాగృతి యూఏఈ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ సంబరాలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ తెలంగాణ జానపద గాయని తేలు విజయ, ఇండియన్ కాన్సిలేట్‌ నుంచి లేబర్ వైస్ కాన్సుల్ ఆనంద్ కుమార్ పిసిపాటి మరియు పలు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులు హాజరయ్యారు.

మహిళలు అందరు కలిసి గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో అందమైన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడారు. ఈ వేడుకకు ట్రైకలర్స్ ప్రాపర్టీస్ ప్రధాన స్పాన్సర్ కాగా, ఎల్.ఎస్, పి.ఎమ్.కె గ్రూప్ అఫ్ కంపెనీస్, BSR సెక్యూరిటీస్, సేఫ్ యార్డ్స్ ఇన్ కో స్పాన్సర్‌గా వ్యవహరించారు.

ఈ సంబరాల్లో ETCA అధ్యక్షులు సత్యం రాధారపు, ETCA వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర, మహిళ విభాగ ఇంఛార్జ్ అల్లూరి సరోజ, తెలుగు అసోసియేషన్ చైర్మన్ దినేశ్ కుమార్ ఉగ్గిన, జనరల్ సెక్రెటరి వివేక్, కల్చరల్ డైరెక్టర్ సురేశ్, తెలంగాణ జాగృతి యూఏఈ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు పీచర, ఉపాధ్యక్ష్యులు అరె శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాణి కోట్ల, కటకం సాయిచందర్ తదితరులు పాల్గొన్నారు. వేడుకులకు సంబంధించి మరింత సమాచారం TV5 గల్ఫ్ టీం చీఫ్‌ కోఆర్డినేటర్‌ శ్రీకాంత్ చిత్తర్వు,కరస్పాండెంట్‌ సౌమ్య అందిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story