Dubai Bathukamma : దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

Dubai Bathukamma : దుబాయ్‌లో స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న తెలంగాణీయులందరు దుబాయ్‌లో ఘనంగా జరుపుకున్నారు. దుబాయ్‌లోని మీడియా ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఈ సంబరాలకు ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకలకు అబూ హెయిల్‌లో అల్ జాహియా బాల్ రూమ్ వేదిక అయింది. వందలాది మంది మహిళలు తరలివచ్చి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ పద్మశ్రీ పద్మజ రెడ్డి, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్దీ గిరీష్ పంత్ ముఖ్య అతిథిలుగా, సెలబ్రిటీ గెస్ట్‌గా బిగ్ బాస్ సీజన్-5 విశ్వ విచ్చేశారు.
బతుకమ్మ సంబరాలు దుబాయ్‌లో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా తెలిపారు. బతుకమ్మ వేడుకలకు సంబంధించి పూర్తి వివరాలు టీవీ5 గల్ఫ్ టీం.. చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ చిత్తర్వు, కరస్పాండెంట్ కవిత అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com