Bathukamma Sarees 2021: బతుకమ్మ చీరలు తీసుకుంటే తీసుకోండి.. లేదంటే వెళ్లిపోండి: ఎంపీపీ గుంత మౌనిక

Bathukamma Sarees 2021: బతుకమ్మ చీరలు తీసుకుంటే తీసుకోండి లేదంటే వెళ్లిపోండని తీవ్రంగా అవమానించింది కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని, ఆ చీరలు మాకొద్దంటూ వనపర్తి జిల్లా కొత్తకోట మహిళలు నిరసన తెలిపారు.
దీంతో మహిళలపై ఫైర్ అయిన ఎంపీపీ మౌనిక.. చీరలు తీసుకోకపోతే వెళ్లిపోవాలని అవమానపరిచారు. అంతేకాదు, పెన్షన్లు కూడా ఇవ్వొద్దంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. ఊర్లో చీరలెవరికీ ఇవ్వొద్దని, అన్నిటినీ ప్యాక్ చేసుకుని వెళ్లిపోండని ఆర్‌ఐని ఆదేశించారు.
దీంతో అక్కడున్న మహిళలు శాపనార్ధాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. జడ్పీ వైస్ ఛైర్మన్ వామనగౌడ్.. మహిళలను పిలిచినా ఎవరూ తిరిగి రాకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com