BATTI: పవర్ షేరింగ్ అనే మాటే లేదు: భట్టి

BATTI: పవర్ షేరింగ్ అనే మాటే లేదు: భట్టి
X
అందరం ఐక్యంగా ఉన్నామన్న భట్టీ

కర్ణా­టక తర­హా­లో తమ ప్ర­భు­త్వం­లో పవ­ర్‌ షే­రిం­గ్‌ అంటూ ఏమీ లే­ద­ని తె­లం­గాణ డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క అన్నా­రు. అం­ద­రం కలి­సి టీం వర్క్‌ చే­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. ‘‘భారత రా­ష్ట్ర సమి­తి నేతల మా­ట­లు మి­తి­మీ­రి పో­యా­యి. మాజీ సీఎం కే­సీ­ఆ­ర్‌ అసెం­బ్లీ­కి రా­వ­డం లేదు.. జనా­ల్లో­కి వె­ళ్ల­డం లేదు. రూ. రెం­డు లక్ష­లు దా­టిన వా­రి­కి రు­ణ­మా­ఫీ చే­యొ­ద్ద­న్న­ది మా ప్ర­భు­త్వ వి­ధాన ని­ర్ణ­యం. రే­ష­న్‌­కా­ర్డు ఆధా­రం­గా­నే రు­ణ­మా­ఫీ చే­శాం. సన్నం బి­య్యం సక్సె­స్ అయ్యిం­ది. గతం­లా పక్క­దా­రి పట్ట­డం లేదు. ఉచిత బస్సు­కు మహి­ళల నుం­చి మంచి స్పం­దన ఉంది. మరో 3వేల బస్సు­లు కొ­ను­గో­లు చే­సేం­దు­కు ప్ర­య­త్నం చే­స్తు­న్నాం.” అని భట్టి వి­క్ర­మా­ర్క అన్నా­రు. ఫో­ర్త్‌ సిటీ పను­లు, మూసీ సుం­ద­రీ­క­రణ ఈ ప్ర­భు­త్వ హయాం­లో­నే పూ­ర్త­వు­తా­య­ని భట్టీ వె­ల్ల­డిం­చా­రు. గాం­ధీ ఘా­ట్‌ వరకు సుం­ద­రీ­క­రణ జరి­గి తీ­రు­తుం­ద­న్నా­రు. ఇటీ­వల జరి­గిన రా­ష్ట్ర కాం­గ్రె­స్‌ పీ­ఏ­సీ సమా­వే­శం­లో ఏఐ­సీ­సీ అధ్య­క్షు­డు ఖర్గే, కేసీ వే­ణు­గో­పా­ల్‌ ప్ర­భు­త్వ తీ­రు­పై పూ­ర్తి సం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­ర­ని భట్టి వి­క్ర­మా­ర్క తె­లి­పా­రు. తె­లం­గా­ణ­లో డబు­ల్‌ ఇం­జి­న్‌ సర్కా­ర్‌ వచ్చే అవ­కా­శం లే­ద­న్నా­రు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం నిజమే: మంత్రి

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42శాతం రి­జ­ర్వే­ష­న్లు అమలు చే­సేం­దు­కు ప్ర­భు­త్వం ఆర్డి­నె­న్స్‌ తీ­సు­కు­రా­వా­ల­ని ని­ర్ణ­యిం­చి­న­ట్లు బీసీ సం­క్షే­మ­శాఖ మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌ వె­ల్ల­డిం­చా­రు. బీ­సీల నోటి వద్ద ము­ద్ద లా­క్కో­వ­ద్ద­ని వి­ప­క్షా­ల­కు వి­జ్ఞ­ప్తి చే­శా­రు. భా­జ­పా బల­హీన వర్గా­ల­కు వ్య­తి­రే­క­మ­న్నా­రు. కా­మా­రె­డ్డి డి­క్ల­రే­ష­న్‌ నుం­చి 42శాతం రి­జ­ర్వే­ష­న్ల వరకు ఎక్క­డా కాం­గ్రె­స్‌ పా­ర్టీ తగ్గ­లే­దు. కాం­గ్రె­స్‌ పా­ర్టీ­తో­నే సా­మా­జిక న్యా­యం జరు­గు­తుం­ది. ఇప్ప­టి­కే పం­చా­య­తీ ఎన్ని­క­లు ఆల­స్య­మ­య్యా­యి. ఎవరూ అడ్డు­ప­డొ­ద్దు’’అని మం­త్రి పొ­న్నం వి­జ్ఞ­ప్తి చే­శా­రు.

బీసీ బిల్లు ఆమోదం జాగృతి విజయం: కవిత

బీసీ బి­ల్లు ఆమో­దం జా­గృ­తి సా­ధిం­చిన వి­జ­యం అంటూ బీ­ఆ­ర్‌­ఎ­స్ ఎమ్మె­ల్సీ కవిత ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­రు. ‘ఆర్డి­నె­న్స్ ప్ర­క­టిం­చి, రా­ష్ట్ర­ప­తి వద్ద బీసీ బి­ల్లు ఆమో­దం పొం­ద­కుం­డా ఉంటే జా­గృ­తి ఆధ్వ­ర్యం­లో రైల్ రోకో ని­ర్వ­హి­స్తాం. ఆర్డి­నె­న్స్‌­పై ప్ర­భు­త్వం ని­ర­క్ష్యం వహి­స్తే ఊరు­కు­నే­ది లేదు. బీసీ బి­ల్లు­ను అమలు చే­య­క­పో­తే రా­ష్ట్రం మొ­త్తం పర్య­టిం­చి జా­గృ­తి ఆధ్వ­ర్యం­లో పె­ద్దఎ­త్తున ఉద్య­మం చే­స్తాం’ అని కవిత హె­చ్చ­రిం­చా­రు. స్థా­నిక ఎన్ని­క­ల­కు ముం­దే 42 శాతం బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై ఆర్డి­నె­న్స్‌ తీ­సు­కొ­స్తా­మ­ని మం­త్రి పొం­గు­లే­టి చె­ప్పా­రు. ఈ ని­ర్ణ­యా­న్ని స్వా­గ­తి­స్తు­న్నాం. ప్ర­భు­త్వ ప్ర­క­టన నే­ప­థ్యం­లో ఈనెల 17న చే­ప­ట్టిన రై­ల్‌ రోకో కా­ర్య­క్ర­మా­న్ని వా­యి­దా వే­స్తు­న్నాం. అయి­తే మాకు కొ­న్ని అను­మా­నా­లు కూడా ఉన్నా­యి. ఆర్డి­నె­న్స్‌ ఇచ్చి వెం­ట­నే రి­జ­ర్వే­ష­న్లు అమలు చే­య­గ­లి­గి­తే అధి­కా­రం­లో­కి వచ్చిన 18 నె­ల­లు ఎం­దు­కు ఆగా­రు? రా­జ­కీయ లబ్ధి కో­స­మే అలా చే­శా­ర­ని మేం భా­వి­స్తు­న్నాం. కాం­గ్రె­స్‌ ఇచ్చిన హా­మీల నుం­చి ప్ర­జల దృ­ష్టి మర­ల్చేం­దు­కే రి­జ­ర్వే­ష­న్ల చు­ట్టూ రా­జ­కీ­యా­లు చే­స్తు­న్నా­రు. అని కవిత వె­ల్ల­డిం­చా­రు. రా­జ్యాంగ సవరణ జరి­గి­తే బీ­సీ­ల­కు రా­జ­కీ­య హ క్కు­లు లభి­స్తా­య­ని కవిత వె­ల్ల­డిం­చా­రు.

Tags

Next Story