నల్గొండ జిల్లాకి చేరిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

నల్గొండ జిల్లాకి చేరిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర
X
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలో కొనసాగుతుంది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలో కొనసాగుతుంది. వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఉప్పలపాడులో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా భట్టి విక్రమార్కకు యాదవ సోదరుడు నాగయ్య గొర్రెపిల్లను బహుకరించాడు. పాదయాత్ర చేసుకుంటూ ముందుకు సాగుతున్న భట్టి విక్రమార్క ప్రజా సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్ర పరిసరాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

అదేవిధంగా మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క కేక్‌ కట్‌ చేశారు. భట్టికి పార్టీ శ్రేణులు కేక్‌ తినిపించారు. సంబరాల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags

Next Story