BC BANDH: బీసీ బంద్‌లో గళమెత్తిన అఖిలపక్ష నేతలు

BC BANDH: బీసీ బంద్‌లో గళమెత్తిన అఖిలపక్ష నేతలు
X
బంద్‌కు మద్దతుగా అధికార పార్టీ ధర్నా... పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు.. రిజర్వేషన్‌కు మద్దతుగా విపక్షాల ఆందోళన

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ కల్పిం­చా­ల­ని, కేం­ద్ర ప్ర­భు­త్వ వై­ఖ­రి­కి ని­ర­స­న­గా ఈరో­జు బీసీ సం­ఘా­లు, అఖి­ల­ప­క్ష పా­ర్టీ­లు తల­పె­ట్టిన రా­ష్ట్ర బంద్ వి­జ­య­వం­త­మైం­ది. ఈ బం­ద్‌­కు అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ సహా ప్ర­తి­ప­క్షా­లు సైతం మద్ద­తు తె­లి­పా­యి. బం­ద్‌­కు అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ సం­పూ­ర్ణ మద్ద­తు ప్ర­క­టిం­చిం­ది. ఈ బం­ద్‌­లో పీ­సీ­సీ చీఫ్ మహే­ష్ గౌడ్ పా­ల్గొ­న్నా­రు. బం­ద్‌­లో మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు, ఎం­పీ­లు పా­ల్గొ­న్నా­రు. మం­త్రి కొం­డా సు­రేఖ,వా­కా­టి శ్రీ­హ­రి, రా­జ్య­సభ సభ్యు­డు అని­ల్ యా­ద­వ్ పా­ల్గొ­న్నా­రు. తె­లం­గాణ భవన్ నుం­చి వి­విధ ప్రాం­తా­ల­కు వె­ళ్లి బీ­ఆ­ర్ఎ­స్‌ నే­త­లు బం­ద్‌­లో పా­ల్గొ­న్నా­రు. బీసీ జే­ఏ­సీ బం­ద్‌­కు తె­లం­గాణ జా­గృ­తి మద్ద­తు తె­లి­పిం­ది. ఖై­ర­తా­బా­ద్ చౌ­ర­స్తా­లో తె­లం­గాణ జా­గృ­తి ఆధ్వ­ర్యం­లో మా­న­వ­హా­రం ని­ర్వ­హిం­చా­రు. జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కవిత మా­న­వ­హా­రం­లో పా­ల్గొ­న్నా­రు. బీ­జే­పీ నే­త­లు కూడా బం­ద్‌­లో పా­ల్గొ­న్నా­రు.


బంద్‌ చేయని దుకాణాలపై దాడులు

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల సా­ధ­న­కు బీసీ జా­యిం­ట్ యా­క్ష­న్ కమి­టీ రా­ష్ట్ర వ్యా­ప్తం­గా ని­ర్వ­హిం­చిన బంద్ వి­జ­య­వం­త­మైం­ది. హై­ద­రా­బా­ద్‌­లో­ని నల్ల­కుంట పరి­ధి­లో బంద్ తీ­వ్ర ఉద్రి­క్త­త­కు దారి తీ­సిం­ది. బం­ద్‌­ను బే­ఖా­త­రు చే­య­కుం­డా తె­రి­చి ఉన్న బజా­జ్ షో‌ రూం­తో పాటు రా­ఘ­వేం­ద్ర టి­ఫి­న్ సెం­ట­ర్‌­పై ఆం­దో­ళ­న­కా­రు­లు పె­ద్ద పె­ద్ద సి­మెం­ట్ బ్లా­క్స్ వి­సి­రా­రు. దీం­తో షో­రూం అద్దా­లు ధ్వం­స­మై చె­ల్లా­చె­దు­రు­గా పడి­పో­యా­యి. అదే­వి­ధం­గా తె­రి­చి ఉం­చిన పె­ట్రో­ల్ బం­క్‌­పై బీసీ సంఘం నా­య­కు­లు దా­డి­కి పా­ల్ప­డ్డా­రు. అనం­త­రం పో­ట్రో­ల్ కొ­ట్టే ఫ్యూ­య­ల్ మె­షి­న్ల­ను వారు ధ్వం­సం చే­శా­రు. ఈ మే­ర­కు వి­ష­యం తె­లు­సు­కు­న్న లో­క­ల్ పో­లీ­సు­లు ఘటనా స్థ­లా­ని­కి చే­రు­కు­ని పరి­స్థి­తి­ని సద్దు­మ­ణి­గే­లా చే­శా­రు. మరి­కొ­న్ని ప్రాం­తా­ల్లో­నూ ఉద్రి­క్త పరి­స్థి­తు­లు నె­ల­కొ­న్నా­యి.


బీసీ బంద్‌లో పాల్గొన్న మంత్రులు, అఖిలపక్ష నాయకులు. మంత్రులు కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, తుమ్మల శ్రీనివాస్ సహా పలువురు మంత్రులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీఆర్ఎస్‌, బీజేపీ అగ్రనేతలు కూడా బీసీ బంద్‌కు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు.

రాజకీయాల్లోకి కవిత కొడుకు..!


42 శాతం రి­జ­ర్వే­ష­న్ల సాధన డి­మాం­డ్‌­తో బీసీ సం­ఘా­లు ని­ర్వ­హిం­చిన బం­ద్‌­లో తె­లం­గాణ జా­గృ­తి సం­పూ­ర్ణ మద్ద­తు ప్ర­క­టిం­చిం­ది. ఈ కా­ర్య­క్ర­మం­లో.. కవిత కు­మా­రు­డు ఆది­త్య సైతం పా­ల్గొ­ని ప్ర­త్యేక ఆక­ర్ష­ణ­గా ని­లి­చా­రు. తల్లి­తో పాటే ని­ర­స­న­ల్లో పా­ల్గొ­న్న ఆది­త్య.. బీ­సీ­ల­‌­కు 42 శాతం రి­జ­‌­ర్వే­ష­‌­న్లు ఇవ్వా­ల్సిం­దే­న­‌­ని ఫ్ల­కా­ర్డు చే­త­బూ­ని ని­నా­దా­లు చే­స్తూ కని­పిం­చా­డు. బీసీ రి­జ­‌­ర్వే­ష­‌­న్లు స్థా­నిక ఎన్ని­క­‌­ల­‌­కు ఎంతో అవ­‌­స­‌­రం’’ అనే అభి­ప్రా­యం వ్య­క్తం చే­శా­డు.

Tags

Next Story