BC BANDH: తెలంగాణ బీసీ బంద్.. సంపూర్ణం.. విజయవంతం

BC BANDH: తెలంగాణ బీసీ బంద్.. సంపూర్ణం.. విజయవంతం
X
బీసీ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన పార్టీలు, నేతలు.. అన్ని జిల్లాల్లో డిపోలకే పరిమితమైన బస్సులు.. మెడికల్ షాపులు మినహా అన్ని మూసివేత

తె­లం­గా­ణ­లో బీసీ బంద్ చె­దు­రు­ము­దు­రు ఉద్రి­క్త­తల మి­న­హా ప్ర­శాం­తం­గా ము­గి­సిం­ది. తె­ల్ల­వా­రు­జా­మున 4 గంటల నుం­చే బంద్ మొ­ద­లైం­ది. త్వ­ర­లో జరు­గ­ను­న్న స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల సాధన కోసం బీసీ సం­ఘా­లు ఇచ్చిన పి­లు­పు­న­కు పా­ర్టీ­ల­కు అతీ­తం­గా ప్ర­జ­లం­ద­రూ స్పం­దిం­చా­రు. బం­ద్‌­లో స్వ­చ్ఛం­దం­గా పా­ల్గొ­న్నా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా అన్ని జి­ల్లా­ల్లో­ని ఆర్టీ­సీ డి­పోల బయట ఎక్క­డి­క­క్కడ బస్సు­ల­ను బీసీ సం­ఘా­లు నే­త­లు అడ్డు­కు­న్నా­రు. తమ బం­ద్‌­కు ప్ర­జ­లు సహ­క­రిం­చా­ల­ని బీసీ నే­త­లు కో­రా­రు. రా­ష్ట్రం­లో మె­డి­క­ల్ షా­పు­లు, అం­బు­లె­న్సు­లు వంటి అత్య­వ­సర సే­వ­లు మి­న­హా అన్ని సే­వ­లు మూ­త­ప­డ్డా­యి.


హైదరాబాద్‌లో..

బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై తె­లం­గాణ వ్యా­ప్తం­గా హై­ద­రా­బా­ద్‌­లో బం­ద్‌ ప్ర­భా­వం కని­పిం­చిం­ది. గ్రే­ట­ర్ హై­ద­రా­బా­ద్ లో ఆర్టీ­సీ డి­పో­ల్లో నుం­చి బస్సు­లు కద­ల­ట్లే­దు. దీం­తో డి­పో­ల­కే ఆర్టీ­సీ బస్సు­లు పరి­మి­త­మ­య్యా­యి. ప్రై­వే­ట్ వి­ద్యా­సం­స్థ­లు బంద్ కు మద్ద­తు­గా సె­ల­వు ప్ర­క­టిం­చా­యి. వ్యా­పార, వా­ణి­జ్య సం­స్థ­లు బం­ద్‌­కు సహ­క­రిం­చా­యి. హై­ద­రా­బా­ద్‌­లో­ని ఎం­జీ­బీ­ఎ­స్‌­లో బస్సు­లు ని­చి­పో­యా­యి. ఎం­జీ­బీ­ఎ­స్ ముం­దు బీసీ సం­ఘాల ని­ర­సన తె­లి­పా­యి. బస్సు­లు ని­లి­చి­పో­వ­డం­తో ప్ర­యా­ణి­కు­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు ఎదు­ర్కొ­న్నా­రు. ఉమ్మ­డి మహ­బూ­బ్ నగర్ జి­ల్లా­లో బంద్ కొ­న­సా­గిం­ది. బస్సు డిపో ముం­దు బై­ఠా­యిం­చి అఖి­ల­ప­క్ష నా­య­కు­లు ధర్నా చే­ప­ట్టా­రు. ఉమ్మ­డి కరీం­న­గ­ర్ జి­ల్లా­వ్యా­పం­గా తె­లం­గాణ ప్ర­భా­వం కని­పిం­చిం­ది.. రా­ష్ట్రం­లో­నే రెం­డో పె­ద్ద బస్టాం­డ్ ఉన్న­టు­వం­టి కరీం­న­గ­ర్ పట్ట­ణం­లో డి­పో­ల­కే బస్సు­లు పరి­మి­తం అయ్యా­యి. అటు స్కూ­ళ్లు కూడా బం­ద్‌­కు సహ­క­రిం­చా­యి. ఖమ్మం జి­ల్లా­లో బంద్ కు అన్ని పా­ర్టీ­లు మద్ద­తు తె­లి­పా­యి. అటు బం­దు­కు వ్యా­పార వా­ణి­జ్య సం­ఘా­లు మద్ద­తు తె­లి­పా­యి. బీసీ రి­జ­ర్వే­ష­న్లు ఆమో­దిం­చా­లం­టూ భద్రా­ద్రి కొ­త్త­గూ­డెం జి­ల్లా­లో బంద్ పా­టిం­చా­రు. మణు­గూ­రు, భద్రా­చ­లం పట్ట­ణా­ల్లో బంద్ చే­ప­ట్టా­రు. ఇల్లం­దు, కొ­త్త­గూ­డెం, పా­ల్వంచ, అశ్వా­రా­వు­పే­ట­లో వి­ద్యా సం­స్థ­లు, వ్యా­పార సము­దా­యా­లు స్వ­చ్ఛం­దం­గా బంద్ కు మద్ద­తు ప్ర­క­టిం­చా­యి. దీం­తో డి­పో­కే ఆర్టీ­సీ బస్సు­లు పరి­మి­త­మ­య్యా­యి.

కిందపడ్డ వీహెచ్

బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల అం­శం­పై బీసీ సం­ఘా­లు నేడు బం­ద్‌­కు పి­లు­పు­ని­చ్చా­యి. హై­ద­రా­బా­ద్‌­లో­ని అం­బ­ర్‌­పే­ట­లో బం­ద్‌­కు మద్ద­తు­గా భారీ ర్యా­లీ ని­ర్వ­హిం­చా­రు. ఈ ర్యా­లీ­లో మాజీ ఎంపీ వి. హను­మం­త­రా­వు­తో సహా పలు­వు­రు ము­ఖ్య నా­య­కు­లు పా­ల్గొ­న్నా­రు. ఈ ర్యా­లీ సం­ద­ర్భం­గా ఫ్లె­క్సీ పట్టు­కు­ని ముం­దు నడు­స్తు­న్న వి. హను­మం­త­రా­వు బ్యా­న­ర్ తట్టు­కు­ని ఒక్క­సా­రి­గా ముం­దు­కు పడి­పో­యా­రు. వెం­ట­నే నా­య­కు­లు ఆయ­న­ను పైకి లేపి సప­ర్య­లు చే­శా­రు. తె­లం­గాణ వ్యా­ప్తం­గా బీసీ బంద్ వి­జ­య­వం­త­మైం­ది. యజ­మా­ను­లు స్వ­చ్ఛం­దం­గా దు­కా­ణా­లు బంద్ చే­శా­రు.

భావోద్వేగానికి గురైన వీహెచ్

రా­ష్ట్రం­లో బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై అం­శం­పై కాం­గ్రె­స్ సీ­ని­య­ర్ నేత, మాజీ రా­జ్య­సభ సభ్యు­లు వీ­హె­చ్ హను­మంత రావు కొంత భా­వో­ద్వే­గా­ని­కి లో­న­య్యా­రు. ఆయన గాం­ధీ­భ­వ­న్ లో మా­ట్లా­డు­తూ.. వె­ను­క­బ­డిన తర­గ­తుల (బీసీ) హక్కు­లు, రి­జ­ర్వే­ష­న్ల­పై తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. కాం­గ్రె­స్ అగ్ర­నేత రా­హు­ల్ గాం­ధీ దే­శ­వ్యా­ప్తం­గా చే­సిన పా­ద­యా­త్ర ద్వా­రా ఎస్టీ, ఎస్టీ, బీసీ వర్గాల కష్టా­ల­ను, సమ­స్య­ల­ను దగ్గ­ర­గా తె­లు­సు­కు­న్నా­ర­ని వీ హెచ్. పే­ర్కొ­న్నా­రు. ఇది ఈ వర్గాల పట్ల కాం­గ్రె­స్ పా­ర్టీ­కి ఉన్న ని­బ­ద్ధ­త­ను సూ­చి­స్తుం­ద­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు. ఇటీ­వల ని­ర్వ­హిం­చిన బీసీ బంద్ కు అన్ని వర్గాల ప్ర­జ­లు సహ­క­రిం­చా­ర­ని, దీని ద్వా­రా వె­ను­క­బ­డిన తర­గ­తుల హక్కుల పట్ల సమా­జం­లో ఉన్న మద్ద­తు స్ప­ష్ట­మైం­ద­ని తె­లి­పా­రు. బీసీ బి­ల్లు­ను రా­జ్యాం­గం­లో­ని తొ­మ్మి­దో షె­డ్యూ­ల్ లో చే­ర్చా­ల­ని వి. హెచ్. ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మో­డీ­ని గట్టి­గా డి­మాం­డ్ చే­శా­రు. ఓబీ­సీ వర్గా­ని­కి చెం­దిన ప్ర­ధా­ని­గా మోదీ, బీ­సీ­ల­కు తప్ప­ని­స­రి­గా న్యా­యం చే­యా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు. ప్ర­స్తు­తం బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పిం­చ­పో­తే.. భవి­ష్య­త్తు­లో రి­జ­ర్వే­ష­న్లు సా­ధిం­చు­కో­వ­డం కష్ట­మ­వు­తుం­ద­ని వి. హెచ్. హె­చ్చ­రిం­చా­రు. బీ­సీల జనా­భా­కు అను­గు­ణం­గా వా­రి­కి రి­జ­ర్వే­ష­న్లు ఇవ్వా­ల­ని పట్టు­బ­ట్టా­రు.

Tags

Next Story