BC RESERVATIONS: బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల

BC RESERVATIONS: బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల
X
బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ అధి­కా­రిక ఉత్త­ర్వు­లు జారీ

తె­లం­గా­ణ­లో బీసీ రి­జ­ర్వే­ష­న్ల జీవో వి­డు­ద­లైం­ది. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ అధి­కా­రిక ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు. మరో­వై­పు తె­లం­గా­ణ­లో స్థా­నిక ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు అవ­స­ర­మైన కస­ర­త్తు దా­దా­పు పూ­ర్త­యిం­ది. పం­చా­య­తీ­రా­జ్‌ శాఖ క్షే­త్ర­స్థా­యి­లో జి­ల్లా పరి­ష­త్‌ ము­ఖ్య అధి­కా­రు­లు, జి­ల్లా పం­చా­య­తీ అధి­కా­రు­ల­తో సం­ప్ర­దిం­పు­లు చే­స్తోం­ది. ఎన్ని­కల వి­ధు­ల్లో పా­ల్గొ­నే రి­ట­ర్నిం­గ్‌ అధి­కా­రుల నుం­చి చె­క్‌­పో­స్టుల వరకు అన్నిం­టి­నీ ఎం­పీ­డీ­వో­లు ఖరా­రు చే­శా­రు. ఈ జీ­వో­ల­ను పం­చా­య­తీ­రా­జ్‌ శాఖ ఉన్న­తా­ధి­కా­రు­ల­కు పం­పా­రు. ఇక క్షే­త్ర­స్థా­యి­లో అధి­కా­రు­లు, సి­బ్బం­ది ఎవరూ సె­ల­వు­లు తీ­సు­కో­వ­ద్ద­నే సూచన కూడా వె­ళ్లి­న­ట్టు సమా­చా­రం. త్వ­ర­లో­నే జర­గ­బో­యే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం, ఎస్సీ,ఎస్టీ­ల­కు 27 శాతం, పూ­ర్తి­గా 69 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ ఎన్ని­క­ల­కు పో­తా­మ­ని సీఎం రే­వం­త్ రె­డ్డి వె­ల్ల­డిం­చా­రు. ఈ నే­ప­థ్యం­లో రా­ష్ట్రం­లో­ని అన్ని జి­ల్లాల కలె­క్ట­ర్ల నుం­చి రి­జ­ర్వే­ష­న్ల­కు సం­బం­ధిం­చిన డే­టా­ను సీ­ల్డ్ కవ­ర్ల రూ­పం­లో ప్ర­భు­త్వా­ని­కి సమ­ర్పిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు ఈసీ కీలక సమావేశం

తె­లం­గా­ణ­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం సన్న­ద్ధ­మైం­ది. ఇవాళ ఉదయం 11 గం­ట­ల­కు రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం.. స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­పై కీలక సమా­వే­శం ని­ర్వ­హిం­చ­నుం­ది. ఈ సమా­వే­శా­ని­కి సీ­ఎ­స్‌ రా­మ­కృ­ష్ణా­రా­వు, డీ­జీ­పీ జి­తేం­ద­ర్‌, ఉన్న­తా­ధి­కా­రు­లు హా­జ­రు­కా­ను­న్నా­రు.రా­ష్ట్రం­లో గ్రా­మీణ స్థా­నిక సం­స్థల ఎన్ని­కల సన్న­ద్ధత ప్ర­ణా­ళి­క­ను ఇప్ప­టి­కే పం­చా­య­తీ­రా­జ్‌ శాఖ వి­డు­దల చే­సిం­ది. తె­లం­గా­ణ­లో 12,760 పం­చా­య­తీ­లు, 1,12,534 వా­ర్డు­లు, 565 జడ్పీ­టీ­సీ­లు, 5,763 ఎం­పీ­టీ­సీ స్థా­నా­ల­కు ప్ర­త్య­క్ష ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు తె­లి­పిం­ది. ప్ర­త్య­క్ష ఎన్ని­కల అనం­త­రం పరో­క్షం­గా 565 మండల పరి­ష­త్‌­లు, 31 జి­ల్లా పరి­ష­త్‌­ల­కు ఛై­ర్‌­ప­ర్స­న్ల ఎన్ని­క­ల­ను ని­ర్వ­హి­స్తా­మ­ని పే­ర్కొం­ది.

మండల, జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయ్యింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీల రిజర్వేషన్ల విధానంపై పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చింది. బీసీలకు కులగణన డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. రేపు రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మండల, జిల్లా పరిషత్‌ లకు ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంది.

Tags

Next Story