Bellampalli MLA Issue: నన్ను లైంగికంగా వేధించి, అమ్మాయిలను పంపాలన్నారు: మహిళ ఆరోపణలు

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ డైరీ పార్టనర్ శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మా దగ్గర డబ్బులు తీసుకొని తన పర్సనల్ పనులకు వాడుకున్నాడని, చెప్పింది చేయనందుకు తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. దళిత బంధు గురించే మట్లాడాలని ఒత్తిడి చేసి బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని పోలీసులకు అప్పగించి 3 రోజులు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని వాపోయింది. ఏ తప్పులు చేయకున్నా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్ చేశారని శైలజ ఆరోపించింది.
అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని తప్పకుండా తన దగ్గరికి పంపాలని ఎమ్మెల్యే అడిగారని, లేకపోతే మీ ఇష్టం అంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. దీంతో చేసేదేం లేక తెలిసిన వాళ్లతో బ్రోకర్ల నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్‌గా ఆయనకు అప్పజెప్పామని. వాళ్లతో ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారని వీడియోలో తెలిపింది. దళితబంధు సమావేశమని పిలిచి తనతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించి. తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శైలజ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వాట్సప్ చాటింగ్‌ను విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com