Pushpa 2 : తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఈ థియేటర్‌లో బెనిఫిట్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన్ను చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే.
పుష్ప 2 దెబ్బ.. టాలీవుడ్ అబ్బా...
పుష్ప 2 దెబ్బకు టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయిపోతోంది. అయితే అది రికార్డులు, కలెక్షన్ల షాక్ కాదు. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ఇక రానున్న ఏ సినిమాలకు తెలంగాణలో బెనిఫిట్ షో అవకాశం ఉండదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com