BETTING: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

BETTING: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
X

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్‌ యాప్స్‌ కేసులను విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌ చీఫ్‌గా ఐజీ రమేష్‌ నియామకం అయ్యారు. సిట్‌ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్‌, శంకర్‌ ఉన్నారు. ఇక, సిట్‌ 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్‌ ఆదేశించారు. సిట్ టీంలో సీనియర్ పోలీస్ అధికారి ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉంటారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బెట్టింగ్ కు సంబంధించి కేసులను సిట్ కు బదిలీ చేయనున్నారు.

ఆన్లైన్ బెట్టింగును నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిట్ ప్రభుత్వానికి సూచించనుంది. పేమెంట్ లకు సంబంధించిన వ్యవహారాలపై RBI కి సిట్ సూచనలను చేయనుంది. పంజాగుట్ట, సైబ‌రాబాద్‌, మియాపూర్ పోలీస్ స్టేష‌న్ల‌లో 25 మంది సెల‌బ్రిటీల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఇతర పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇదివరకే యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల సహా పలువురు విచారణకు హాజరై బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు.


Tags

Next Story