BETTING APPS: మరో ఆరుగురికి పోలీసుల నోటీసులు

BETTING APPS: మరో ఆరుగురికి పోలీసుల నోటీసులు
X
శ్యామల, రీతూ చౌదరీ సహా నలుగురికి నోటీసులు... రేపు విచారణకు హాజరు

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిలో మరో ఆరుగురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఇవాళ పంజా గుట్ట పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వైసీపీ నేత, నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు హర్ష సాయి దుబాయ్‌కి పరారయ్యారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పంజాగుట్ట పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంత మంది ప్రమోటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్..విచారణకు హాజరయ్యారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు..

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌లపై కేసు నమోదు చేశారు. అమాయకులను మోసం చేసి రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు.

బెట్టింగ్ ఊబిలోపడి యువకుడు ఆత్మహత్య

ఏపీలో నంద్యాల జిల్లాకు చెందిన యువకుడు బెట్టింగ్ ఊబిలో పడి తెరుకోలేక అప్పు మీద అప్పు చేసి తీర్చేందుకు స్తోమత లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల మండలం గోర్వి మాను పల్లె కి చెందిన బలిజ మహేంద్ర వాలంటీర్ గా పని చేస్తూ ఉండేవాడు గత ప్రభుత్వంలో ప్రస్తుతం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటు ఉన్న మహేంద్ర నేడు అప్పుల బాధ తాళలేక రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

ఆన్లైన్ బెట్టింగ్లపై పటిష్ఠ నిఘా: ఎస్పీ

ఆన్లైన్ బెట్టింగ్, గేమ్లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్పై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. మోసపూరితమైన సందేశాలను నమ్మి ఇతరులకు వివరాలు ఇవ్వరాదని జిల్లా ప్రజలకు సూచించారు. ఆన్లైన్లో డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎవరైనా చెప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.

Tags

Next Story