Bhadrachalam: రాములోరి లడ్డూ లొల్లి....

Bhadrachalam: రాములోరి లడ్డూ లొల్లి....
భద్రాచలం రాములోరి లడ్డూ నాణ్యతపై నీలినీడలు; బూజుపట్టిన లడ్డూల విక్రయాలపై భక్తుల ఆగ్రహం; విచారణ చేపట్టి ముగ్గురికి మెమోలు ఇచ్చిన అధికారులు

భద్రాచలం రాములోరి లడ్డూ నాణ్యతపై నీలినీడలు అలుముకున్నాయి. బూజుపట్టిన లడ్డూల విక్రయం కలకలం రేపింది. లడ్డూ తయారీ కేంద్రాలను సీజ్ చేసేందుకు వచ్చిన పోలీసులను సైతం ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ వివాదంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు విచారణ చేపట్టారు.. అధికారులు. ఇక ఈ వ్యహారంపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. జనవరి 2వ తేదీన ఘటన జరిగితే 20 రోజుల తరువాత విచారణ కమిటీ నివేదిక ఇచ్చారు. ఇక దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశాలతో ఏఈవో శ్రావణ్ కుమార్ తో పాటు మరో ముగ్గురికి మెమోలు జారీ చేశారు. మరోవైపు ఈ వ్యహారంపై భక్తులు మండిపడుతున్నారు. భద్రాద్రి రాములోరి ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా సిబ్బంది వ్యవహారిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మెమోలతోనే సరిపెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జరిగిన నష్టం ఎలా పూడ్చుతారని నిలదీస్తున్నారు. లడ్డుల నాణ్యత, పరిశుభ్రతపై చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story