Bhadrachalam: అర్ధరాత్రి ఆదివాసీలు ఆందోళన

Bhadrachalam: అర్ధరాత్రి ఆదివాసీలు ఆందోళన
X
భద్రాచలం శివారు ప్రాంతంలో ఆదివాసీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం

అర్ధరాత్రి పూట ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. భద్రాచలం శివారు ప్రాంతంలో ఆదివాసీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకుని కొందరు ఆదివాసీలు నివసిస్తున్నారు. అయితే అది ప్రైవేటు స్థలం కావడంతో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో స్థల యజమానులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులతో స్థలాన్ని ఖాళీ చేయించేందుకు వచ్చారు. ఈ నేపధ్యంలో అక్కడ ఉన్న ఓ గుడిసె తగలపడింది. దీంతో పోలీసులే గుడిసెలను తగలబెట్టారని, అందులో ఓ వృద్ధ మహిళ సజీవ దహనం అయిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆదివాసీలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తమకు ఇళ్ల జాగాలకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చూస్తూ ITDA పీఓ, తహసీల్దార్‌ వచ్చి తమకు సమాధానం ఇవ్వాలని పట్టు పట్టారు. అయితే ఆందోళన విరమించి కోర్టు ఉత్తర్వలను గౌరవించాలని పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు..అందుకు ఆదివాసులు ఒప్పుకోకపోవడంతో ఆందోళన కొనసాగుతుంది.

Tags

Next Story