Bhadradri: కాసేపట్లో సీతారాముల కళ్యాణం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. లోక కళ్యాణార్థం ప్రతి ఏడాది అభిజిత్ లగ్నంలో సకల దేవతల సాక్షిగా భద్రాచల మిధున స్టేడియంలోని ఏకశిలా మండపంలో సీతమ్మవారిని రామచంద్రయ్య పరిణయం ఆడబోతున్నారు. ఈ వేడుకలను కనులారా వీక్షించి తరించేందుకు వేలాది మంది భక్తులు భద్రాచలం బాట పడుతున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా తెల్లవారు జామున 2 గంటలకు దేవాలయం తలుపులు తెరిచారు. అరగంట సేపు సుప్రభాత సేవ జరిగింది. 2.30 నుంచి 4 వరకు తిరువారాధన, నివేదన, శాత్తుమురై నిర్వహించారు.ఉదయం 4 నుంచి 5 వరకు మూలవరులకు అభిషేకం, 5 నుంచి అరగంటపాటు అలంకారం చేశారు అలయ వేద పండితులు.మధ్యాహ్నం వరకు శ్రీవారి సర్వ దర్శనం ఉంటుంది.ఉదయం 8 నుంచి 9 వరకు ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించి..దేవాలయం నుంచి కల్యాణమూర్తులను మిధిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకురానున్నారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీసీతారామచంద్రుల కల్యాణ మహోత్సవం ఉంటుంది. అనంతరం ఆలయానికి ఊరేగింపుగా వేంచేస్తారు. మధ్యాహ్నం మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం కార్యక్రమం ఉంటుంది.సాయంత్రం వరకు దర్శనాలకు అనుమతిస్తారు, ఇక సాయంత్రం 5 నుంచి 5.30 వరకు ఆరాధన, 6 నుంచి 7 వరకు శ్రీరామ పునర్వస దీక్షలు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు తిరువీధిసేవ, 10 నుంచి 10.30 వరకు నివేదన చేసి ఆలయ తలుపులు మూస్తారు.
భద్రాచలం మిథిలా స్టేడియంలో నిర్వహిస్తోన్న సీతారాముల కల్యాణోత్సవానికి సకల ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ అనుదీప్. భక్తులంతా వీక్షించేలా అరేంజ్‌మెంట్స్ చేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వీఐపీలకు సెపరేట్ వింగ్స్ పెట్టారు. లడ్డూలు, తలంబ్రాలు అందించేందుకు 70 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక, భద్రత కోసం 2వేల మంది పోలీసులను గ్రౌండ్‌లో మోహరించారు.సీతారాముల కల్యాణం తర్వాత రేపు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరు కానున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com