Bharat Jodo Yatra: తెలంగాణలో భారత్ జోడో యాత్ర రెండో రోజు..

Bharath Jodo Yatra: తెలంగాణలో రెండో రోజు భారత్ జోడో యాత్ర సరదాగా సాగుతోంది.. జోడో యాత్రలో భాగంగా.. రాహుల్ ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు. ఓ సాదారణ కార్యకర్తలా పెట్రోల్ బంక్‌లో కాంగ్రెస్ నేతలతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేశారు రాహుల్.. బ్రేక్ టైంలో రాహుల్ జోడో యాత్ర రూట్ మ్యాప్ పై వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్.
ఉదయం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్ యాత్ర ప్రారంభించారు. పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్‌రోడ్డు, కచ్వార్ గ్రామం మీదుగా బండ్లగుంట వరకూ పాదయాత్ర సాగుతుంది. అక్కడ లంచ్ బ్రేక్ ఇచ్చారు. అక్కడే టీపీసీసీ నేతలతో రాహుల్ సమావేశం అయ్యారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా పాల్గొన్నారు.. లంచ్ బ్రేక్ తరువాత బీడీ కార్మికులు, పత్తి రైతులతో ప్రత్యేక సమావేశం కానున్నారు రాహుల్.
తిరిగి సాయంత్రం 4 గంటలకు బండ్ల బండ్లగుంట నుంచి మళ్లీ పాదయాత్రను రాహుల్ ప్రారంభిస్తారు. గుడిగండ్లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ప్రసంగించనున్నారు. ఇవాళ మొత్తం 26 కిలోమీటర్ల యాత్ర సాగనుంది. రాత్రి గుడిగండ్లలో రాహుల్ బస చేయనున్నారు.
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్‌ను కలిసేందుకు సెక్యూరిటి వలయం దాటుకొని
మరీ దూసుకు వస్తున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.మక్తల్ ప్రాంత రైతులతో మాట్లాడుతున్నారు.దారి పక్కన వేచి చూస్తున్న ప్రజల దగ్గరికి వెళ్లి పలకరిస్తున్నారు రాహుల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com