తెలంగాణలో భయంకరమైన పరిస్థితులు: భట్టి

తెలంగాణలో నేడు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ ఊరు వెళ్లినా సమస్యలు తాండవిస్తున్నాయని భట్టి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని.. దళితులకు మూడెకరాల సంగతేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని.. కానీ బీఆర్‌ఎస్ నాయకుల జీవితాల్లో మాత్రం అద్భుతమైన మార్పు వచ్చిందన్నారు.
నల్గొండ జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు నాడు కాంగ్రెస్ తలపెట్టిన SLBC టన్నెల్‌ను.. ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. 32 కిలోమీటర్ల పనులు పూర్తైనా.. రెండుమూడు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. తాను ఏ నియోజకవర్గానికి వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com