ఇలాంటి నాయకులతో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగదు : భట్టి విక్రమార్క

X
2020లో కరోనా, వరదలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని.. ప్రభుత్వం కనీసం వారిని పట్టించుకోలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పాలనను గాలికొదిలేసి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని మండిపడ్డారు. పీఆర్సీ కోసం వేసిన కమిటీ 31 నెలలైనా నివేదిక ఇవ్వలేదని.. అయినా కానీ ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ పిలవగానే ప్రగతి భవన్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఉంది ప్రభుత్వం కోసమా.. ఉద్యోగుల కోసమా అని నిలదీశారు. ఇలాంటి నాయకులతో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగదని.. ఉద్యోగులు ఆలోచించాలని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
