Bhu Bharati Act : 14న 'భూభారతి' ప్రజలకు అంకితం!

Bhu Bharati Act : 14న భూభారతి ప్రజలకు అంకితం!
X

రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుందని తెలంగాణ రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం రోజు మణుగూరులోని పినపాక శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..... ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఒక మైలురాయిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములను భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం 2025 ని అన్ని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఈ సభకి ఆహ్వానించి, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉండే భూములను ఆసాములకు ద్వారా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రభుత్వంపై ఎంతమంది, ఎన్ని శక్తులు, కుట్రలు కుతంత్రాలు పన్నిన ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం ధరణి ప్రవేశ పెట్టీ ఒక కోటి 57 లక్షల ఎకరాలను విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. ధరణి మూడేళ్ల పాటు అమల్లో ఉన్న రూల్స్ ను రూపొందించలేదని.... కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భూభారతి చట్టానికి చట్టం రూపొందించిన అనతి కాలంలోనే రూల్స్ ను రూపొందించమని తెలిపారు. దీని ద్వారా చిన్న సమస్య కూడా క్షణాల్లో ప్రకారం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Tags

Next Story