Khammam: ఉద్రిక్తంగా భూదాన్

ఖమ్మంలోని వెలుగుమట్లలో భూదాన్ భూ వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. గుడిసెలను తొలగించేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు. భూదాన్ భూమి కాకుండా పక్కనున్న తమ భూముల్లోకి వస్తున్నారంటూ.. పోలీసుల్ని ఆశ్రయించారు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు. దీంతో జేసీబీలు, ఫైరింజన్లతో పోలీసులు మోహరించారు. అయితే.. తమ భూమి జోలికి రావొద్దంటూ పోలీసుల్ని అడ్డుకుంటున్నారు భూదాన్ వాసులు. నవోదయ కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. పోలీసులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
వెలుగుమట్ల గ్రామ రెవిన్యూలో మొత్తం 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది. 2018 నుంచి గుడిసెలు వేసుకొని వెయ్యి మంది ప్రజలు నివసిస్తున్నారు. భూదాన్ బోర్డ్ నుండి పొజిషన్ పట్టాలు, హైకోర్టు నుండి కరెంట్, నీటి వసతి కల్పించమని ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ప్రైవేట్ వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com