Telangana : గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌.. !

Telangana : గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌.. !
Telangana : ప్రభుత్వ తీరుతోనే ప్రగతి భవన్‌కు రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్‌ పెరుగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు..

Telangana : ప్రభుత్వ తీరుతోనే ప్రగతి భవన్‌కు రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్‌ పెరుగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు.. పాత విషయాలన్నీ తవ్వి తీస్తున్నారు.. గవర్నర్‌గా తమిళిసై బాధ్యతలు చేపట్టిన తర్వాత 2020 జనవరి 2న తమిళిసై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్భార్‌ నిర్వహించాలని నిర్ణయించారు.. అప్పట్లో గవర్నర్‌ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయింది.. అయితే, ప్రగతిభవన్‌కు పోటీ అంటూ అధికార పార్టీ నేతలు ఫైరయ్యారు.. ఇక 2020 ఆగస్టులో కరోనా విజృంభిస్తున్న సమయంలో గవర్నర్‌ తమిళిసై స్వయంగా అధికారులతో రివ్యూలు పెట్టడం, టెస్టులతోపాటు కోవిడ్‌ సెంటర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.. కానీ, తన సలహాను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అసహనం వ్యక్తం చేశారు.

అయితే, ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది.. బీజేపీ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టింది. ఇక గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్‌ రెడ్డి నామినేషన్‌ వేయగా.. ఆమోదం తెలపాలని ఫైల్‌ను గవర్నర్‌ వద్దకు పంపింది ప్రభుత్వం.. అయితే, కౌశిక్‌ రెడ్డికి సర్వీస్‌ కోటా ఇవ్వలేమని గవర్నర్‌ ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడం చర్చనీయాంశం అయింది.. గవర్నర్‌ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పు పట్టారు.. రాజకీయం సేవ కాదా అంటూ ప్రశ్నలు సంధించారు.

ఇక 2022 జనవరి 1న ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాల తీసుకునేందుకు ప్రజాదర్భార్‌ ఏర్పాటు చేశారు గవర్నర్‌.. అయితే, గవర్నర్‌ నిర్ణయంపై ప్రభుత్వ పెద్దల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. రాజ్‌భవన్‌ నుంచి సమాంతర పాలన అంటూ కౌంటర్లు పడ్డాయి.. ఇక సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రొటోకాల్‌ వివాదం గవర్నర్‌కు, గవర్నమెంట్‌కు మధ్య గ్యాప్‌ పెంచింది.. మంత్రులు స్వాగతం పలకలేదని గవర్నర్‌ అసహనం వ్యక్తం చేయగా.. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే అది జరిగిందని ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.

గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సెషన్‌ సాగింది.. దీనిపై గవర్నర్‌ సీరియస్‌ అయ్యారు.. అయితే, సభ ప్రోరోగ్‌ కాకపోవడం వల్లే గవర్నర్‌ ప్రసంగం పెట్టలేదని ప్రభుత్వం చెప్పింది.. ఇక మొన్న జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య గ్యాప్‌ కనిపించింది.. రాజ్‌భవన్‌ ఉగాది వేడుకలకు ప్రభుత్వ పెద్దలు ఎవరూ వెళ్లకపోవడం చర్చనీయాంశం అయింది.. అయితే, అదే సమయంలో కనీసం అక్కడ ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్‌ ఫొటో కూడా పెట్టలేదన్న వాదనను ప్రభుత్వ పెద్దలు తెరమీదకు తీసుకొచ్చారు.

ఇక మొన్నటికి మొన్న గవర్నర్‌ యాదాద్రి పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది.. గవర్నర్‌ యాదాద్రికి వెళ్లగా.. ఈవో గానీ, జిల్లా మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగా గానీ కనీసం రాలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.. అయితే, దీనికి కూడా ప్రభుత్వ పెద్దల నుంచి గట్టి సమాధానమే వచ్చింది.. అసలు ప్రొటోకాల్‌ వివాదమే లేదని మంత్రులు చెప్పారు.. తమిళిసై బీజేపీ నేతగా వచ్చారంటూ కౌంటర్‌ ఇచ్చారు.

గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌

2020 జనవరి 2

ప్రజా సమస్యల కోసం గవర్నర్‌ ప్రజా దర్భార్‌

ప్రగతి భవన్‌కు పోటీ అంటూ అధికార పార్టీ నేతల ఫైర్‌

2020 ఆగస్టు

కరోనా వేళ టెస్టులు, కోవిడ్‌ సెంటర్లు పెట్టాలన్న గవర్న్‌

తన సలహాను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అసహనం

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామన్న ప్రభుత్వం

2021 సెప్టెంబరు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్‌ రెడ్డి నామినేషన్‌

కౌశిక్‌ రెడ్డికి సర్వీస్‌ కోటా ఇవ్వలేమని చెప్పిన గవర్నర్‌

రాజకీయం సేవా కాదా అంటూ ప్రభుత్వం నుంచి కౌంటర్‌

2022 జనవరి 1

ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకోవాలని గవర్నర్‌ నిర్ణయం

సమాంతర పాలనంటూ ప్రభుత్వ పెద్దల నుంచి విమర్శలు

2022 ఫిబ్రవరి 19

సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రొటోకాల్‌ వివాదం

మంత్రులు స్వాగతం పలకలేదని అసహనం

కమ్యూనికేషన్‌ గ్యాప్‌ అంటున్న మంత్రులు

2022 మార్చి

గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సాగిన బడ్జెట్‌ సెషన్‌

సభ ప్రొరోగ్‌ కాలేదనే పిలవలేదన్న ప్రభుత్వం

2022 ఏప్రిల్‌ 1

రాజ్‌భవన్‌ ఉగాది వేడుకల్లో కనిపించని ప్రభుత్వ పెద్దలు

ఫ్లెక్సీలో సీఎం ఫొటో కూడా పెట్టలేదన్న మంత్రులు

2022 ఏప్రిల్‌ 2

యాదాద్రి పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం

తమిళిసై బీజేపీ నేతగా వచ్చారంటున్న మంత్రులు

Tags

Read MoreRead Less
Next Story