KTR : కేటీఆర్ కు బిగ్ రిలీఫ్.. మూడు కేసులను కొట్టివేసిన హైకోర్టు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నల్లగొండ జిల్లాలో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన మూడు కేసులను కొట్టేసింది. ఈ ఏడాది టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిన ఘటనపై కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టులను ఫార్వర్డ్ చేశారంటూ.. మున్సిపల్ చైర్ పర్సన్ రజిత నకిరేకల్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు కేటీఆర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా మన్నే క్రిశాంక్, ఏ2గా కేటీఆర్, ఏ3గా దిలీప్ కుమార్ లను చేర్చారు. ఇదే అంశంపై ఉగ్గడి శ్రీనివాస్, నరేందర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేయగా.. రెండు ఎఫ్ఎస్ఐఆర్ లు ఫైల్ చేశారు. ఈ 3 కేసులపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాజాగా వాటిని కొట్టివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com