Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో భారీ కుంభకోణం..!

Warangal MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డుల్లో అక్రమాలు ఇంజెక్షన్ల దందా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, రెమ్ డెసివిర్, ఇంజెక్షన్ల కుంభకోణం గుట్టుపై ప్రభుత్వ పెద్దలు కూపీ లాగుంతుంటే దారుణాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్పత్రికి సరఫరా చేసిన 1,100 ఆక్సిజన్ ఫ్లో మీటర్లలలో 700 మాయమయ్యాయి. 6478 రెమ్ డెసివిర్, ఇంజెక్షన్ల లలో సగానికిపైగా మాయమైనట్టు విచారణలో తేలింది.
ఎంజీఎం మాజీ సూపరిండెంట్ పై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అతన్నీ వీధుల్లో నుంచి బహిష్కరించారు. ఇక అటు కుంభకోణం మెడికల్ మాఫియా డొంక కదులుతోంది. మాఫియా గుట్టుపై సీఎం ఆఫీస్ కు నివేదిక చేరిందని తెలుస్తోంది. ఎంజీఎంకు కేటాయించిన ఇంజెక్షన్ల లలో సగం బ్లాక్ మార్కెట్ కు తరలించడం, కరోనా రోగుల పేరిట తప్పుడు కే షీట్లు తయారుచేసి బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహించిన అధికారులపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com